అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి దుండగుడు ప్రయత్నించాడు. అయితే సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి అనంతపురం రైల్వేస్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఎటిఎంలోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. డబ్బులు డ్రా చేస్తున్నట్లు కాసేపు నటించి ఏటీఎం పగలగొట్టేందుకు..
అనంతపురం, మార్చి 17: అనంతపురం నగరంలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి దుండగుడు ప్రయత్నించాడు. అయితే సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి అనంతపురం రైల్వేస్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఎటిఎంలోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. డబ్బులు డ్రా చేస్తున్నట్లు కాసేపు నటించి.. ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏటీఎం మెషిన్ తలుపులు కూడా తెరిచాడు. అంతలోనే బ్యాంక్ సైరన్ మోగడంతో దుండగుడు అక్కడ నుంచి పరారయ్యాడు.
ఏటీఎం సెంటర్లు సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన త్రీ టౌన్ పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా సాయి కుమార్ అనే యువకుడు ఏటీఎంలో చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం దుండగుడు సాయికుమార్ ఏటీఎం సెంటర్ నుంచి ఎటువైపు వెళ్ళాడనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీ కెమెరాలు పరిశీలించగా.. బస్టాండ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. గంటల వ్యవధిలోనే ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సాయికుమార్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు ఏటీఎం సెంటర్లో చోరీ యత్నించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Also read
- ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!
- సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
- Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
- మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం




