సూపర్ భాజారు (కొత్తగూడెం):అత్తింటి వేధింపులతో ఉపాధ్యాయురాలు భూక్య కవిత(36) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్డే టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. భూక్య కవిత భద్రాచలంలో, ఆమె భర్త నాగేశ్వరరావు బూర్గంపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దంపతులకు 5, 6 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగింది. భర్త బయటకు వెళ్లివచ్చేసరికి తలుపు గడియపెట్టి ఉంది. కిటికీలో నుంచి చూడగా కవిత ఉరి వేసుకుని ఉండటంతో 108కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చాక తలుపు పగులగొట్టి ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. భర్త, అత్త, మామ, బావ, తోటి కోడలు, భర్త మేనకోడలు కలిసి నాగేశ్వరరావుకు వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా, వన్డేన్ ఎస్ఐ విజయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





