క్లాస్ రూమ్లో దారుణం జరిగింది. చిన్న గొడవ కారణంగా ఉపాధ్యాయుడిపై విద్యార్థి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగింది.
చిన్న కారణం గొడవగా మారడంతో విద్యార్థిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడారు. దీంతో కోపోద్రికుడైన విద్యార్థి అందరూ చూస్తుండగా, వీడియో తీస్తున్నా సరే ఉపాధ్యాయుడిపై పిడుగుద్దులు కురిపించారు. మిగిలిన టీచర్లు చెబుతున్నా వినకుండా స్టూడెంట్ దాడి చేయడంతో ఉపాధ్యాయుడి విలవిలలాడిపోయారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాధ్యాయుడు దుర్భాషలాడటంపై కొందరు విమర్శస్తుంటే మరికొందరు మాత్రం చిన్న వయసులో విద్యార్థిని ఇప్పుడు కట్టడి చేయాలని, లేని పక్షంలో ఉన్మాదిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





