రెండు వేల రూపాయల వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇచ్చిన అప్పును తిరిగి అడిగినందుకు.. ఓ మేస్త్రీ.. తన దగ్గర పనిచేసే కూలీని రాడ్డుతో కొట్టి చంపాడు.. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్ అడుగుతున్నా తుజారామ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ డబ్బులు ఇచ్చేవాడు కాదు..
ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అంతా మద్యం తాగుతున్నారు.. ఈ సమయంలో మేస్త్రీ తుజారామ్‌తో కలిసి ఓం ప్రకాష్ కూడా మద్యం తాగాడు. తన బాకీ ఎప్పుడిస్తావ్ అంటూ ఓం ప్రకాష్, మేస్త్రీ తుజారామ్‌ను నిలదీశాడు. నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో.. ఓం ప్రకాశ్ నిలదీశాడు.. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ.. వాదనకు దిగారు.. ఇరువురు మధ్య కొద్దిపాటి ఘర్షణ నెలకొంది.
తన దగ్గర పనిచేసే కార్మికుడు బాకీ విషయం అందరి ముందు అడగడంతో అవమానంగా భావించిన తుజారామ్ ఇనుప రాడ్డు తీసుకుని ఓం ప్రకాష్ తలపై తీవ్రంగా కొట్టిగాయపర్చాడు. తీవ్రగాయాలైన ఓం ప్రకాష్ (35) అక్కడికక్కడే చనిపోయాడు. కార్మికుడు ఓంప్రకాష్ మృతి చెందిన ఘటనపై హత్య కేసు నమోదు చేసుకుని చీమకుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also read
- మద్యం మత్తులో హోం గార్డుపై దాడి!
- ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు కురిపించిన విద్యార్థి… వీడియో వైరల్
- దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
- ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
- పెయింటింగ్స్ రూపంలో డ్రగ్స్ రవాణా





