జగిత్యాల జిల్లాలోని రంగసాగర్ గ్రామ ప్రజలకు క్షుద్రపూజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తు్న్నాయి. తాజాగా, గ్రామానికి చెందిన శ్రీరాముల గంగయ్య పొలం వద్ద ఉన్న చింత చెట్టు ముందు గత మూడు రోజుల నుండి ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త పద్ధతిలో, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రితో ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.
అయితే గతంలోనూ నాగవత్ రాజేష్ నాయక్ ఇంటి ముందు ఇలాంటి పూజలే జరిగాయి. ఆ తర్వాత బాణావత్ గంగారాం ఇంటి పక్కన కూడా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నారో తెలియక గ్రామస్థులు భయాందోళనకు లోనవుతున్నారు.
ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు స్పందించి, రాత్రి పూట గస్తీ పెంచి, ఈ పనులకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవాలని రంగసాగర్ గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతి ఆదివారం ఇదే విధంగా పూజలు చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
Also read
- ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!
- Hyderabad: టెర్రస్‌పై ఎక్కువ సేపు ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఆరా తీస్తే అసలు కథ తెలిసింది..
- బాకీ తీర్చలేదని బంధాన్ని తుంచేశాడు.. పుట్టబోయే బిడ్డతో సహా ముగ్గురి ప్రాణాలను చిదిమేశాడు!
- రూ. వంద కోసం దారుణం! ప్రాణాలు కోల్పోయిన ఛాయ్‌వాలా.. చావు బతుకుల మధ్య మరొకరు!
- పోలీస్ ఆఫీసర్కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. ..





