తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో దారుణ హత్య చోటు చేసుకుంది. తమ చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ఓ యువకుడిని రాళ్లతో కొట్టి చంపేశారు యువతి సోదరులు. అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న జంట స్వగ్రామానికి వెళ్తుండగా ప్లాన్ చేసి మరీ హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తితోపాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు.
తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో సూర్య ప్రకాష్ (40) అనే యువకుడిని రాళ్ళతో కొట్టి హతమార్చారు. జెడ్. మేడపాడు గ్రామానికి చెందిన యువతి వేములపల్లికి చెందిన పోలపల్లి సూర్య ప్రకాష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 26) అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకుని తమ కుటుంబం పరువు తీశాడనే నెపంతో సూర్య ప్రకాష్ హత్ కు పధకం రూపొందించారు యువతి అన్నదమ్ములు. స్థానికులు ఈ ఘటనను పరువు హత్య గా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వేములపల్లి వెళుతున్న తరుణంలో యువతి అన్నా, తమ్ముడబు దారి కాసి సూర్య ప్రకాశ్‌ను పట్టుకున్నారు. సూర్య ప్రకాష్‌ను తీవ్రంగా కొట్టి, రాళ్లతో మోదీ అత్యంత దారుణంగా హతమార్చారు. అనంతరం పారిపోయేందుకు యత్నిస్తున్న నిందితులను స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్య చేసిన అన్నదమ్ములను, వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





