అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఫోన్‌కు భారీగా మెసేజ్‌లు వచ్చాయి. రూ. 500 నుంచి రూ. 50 వేల వరకు బాధితుడి బ్యాంక్ ఖాతాల నుంచి వరుసగా డ్రా చేసి రెండు ఖాతాలను ఒకే సమయంలో ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు.
కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన విశాల్ పవర్ జిమ్ నిర్వాహకుడు ఖండ్రే విశాల్ అనే యువకుడి బ్యాంక్ అకౌంట్‌ల నుంచి అతని ప్రమేయం లేకుండా రూ. 3.09 లక్షలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఫోన్‌కు భారీగా మెసేజ్‌లు వచ్చాయి. రూ. 500 నుంచి రూ. 50 వేల వరకు బాధితుడి బ్యాంక్ ఖాతాల నుంచి వరుసగా డ్రా చేసి రెండు ఖాతాలను ఒకే సమయంలో ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు.
ఉదయం లేచి చూసేసరికి భారీగా నగదు డ్రా చేసినట్టుగా మెసేజ్‌లు ఉండటంతో షాక్‌కు గురైన విశాల్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ఎలాంటి ప్రమేయం లేకుండానే ఎలాంటి లింక్‌లను ఓపెన్ చేయకుండానే తన అకౌంట్‌లో నుంచి డబ్బులు పోయాయంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
Also read
- బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
- ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
- వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు.. మీ పూర్వీకుల ఆశీస్సులు లభించి సక్సెస్ మీ సొంతం!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





