దుబాయ్ వీసా ప్రాసెస్కు నగరానికి యువతి
కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హోంగార్డు
ట్యాంకర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్: ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లేందుకు
సిద్ధమవుతున్న యువతి.. పార్టెమ్ ర్యాపిడో డ్రైవర్గా అదనపు సంపాదన కోసం కష్టపడుతున్న హోంగార్డు.. వేర్వేరు ప్రాంతాలు.. సోమవారం రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ మృతి చెందారు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం…
ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చింది. చింతల్లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఆమె సోమవారం ఉదయం మెహిదీపట్నంలో దుబాయ్ వెళ్లే ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్ చేసుకుంది. సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) ఉదయం 8 గంటలకు విధులు ముగించుకున్న అనంతరం ర్యాపిడో విధుల్లోకి చేరాడు. మెహిదీపట్నంలో అక్షితను బైక్పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1 వెంగళరావు పార్కు టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ట్యాంకర్ వెనుక టైర్ ఇద్దరి మీదుగా వెళ్లడంతో అక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న హుస్సేన్ ను నిమ్స్ తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు.
ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చింది. చింతల్లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఆమె సోమవారం ఉదయం మెహిదీపట్నంలో దుబాయ్ వెళ్లే ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్ చేసుకుంది. సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) ఉదయం 8 గంటలకు విధులు ముగించుకున్న అనంతరం ర్యాపిడో విధుల్లోకి చేరాడు. మెహిదీపట్నంలో అక్షితను బైక్పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1 వెంగళరావు పార్కు టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ట్యాంకర్ వెనుక టైర్ ఇద్దరి మీదుగా వెళ్లడంతో అక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న హుస్సేన్ను నిమ్స్క తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు.
బంజారాహిల్స్ ఇబ్రహీంనగర్కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఖాజాపాషా (30)ను హత్యాయత్నం కింద పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాంద్రాయణగుట్ట అల్జుబెల్కాలనీకి చెందిన హుస్సేన్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెల్లారితే దుబాయ్ వెళ్లే ఆనందంలో అక్షిత ఉండగా, కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హుస్సేన్.. అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు.
Also read
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
- ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య.. కంపెనీలో చేరిన పది రోజుల్లోనే
- వివాహితను నమ్మించి వంచించిన కేడీలు





