SGSTV NEWS online
Andhra PradeshCrime

అయ్యో భగవంతుడా.. తెల్లారితే పంక్షన్.. మృ‌త్యువుగా మారిన గ్రైండర్.. సెకన్లలోనే..



ఏలూరు: వేడుకలైనా.. శుభకార్యాలైనా..? ఎక్కడైనా.. పిల్లలదే కదా సరదా సందడి.. వారు లేకపోతే.. ఎలాంటి హడావుడి ఉండదు.. వంటశాలల నుంచి వేడుక మండపం వరకు కలియతిరిగుతూ.. తమ ఆటలతో హడావుడి చేస్తుంటారు. ఇక తొలి బంతిలో కూర్చుని భోజనం చేయడమంటే పిల్లలకు మరింత సరదాగా ఉంటుంది.. అయితే, ఏలూరు జిల్లాలో ఇలాంటి ఒక ఫంక్షన్ లో విషాదం చోటుచేసుకుంది. మేనమామ ఇంట్లో పంక్షన్ కు వెళ్లి.. 11 ఏళ్ల పిల్లవాడికి విద్యుత్ షాక్ తగలి.. మృతి చెందాడు. శుభకార్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో.. తల్లిదండ్రులు సహా అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

అసలేం జరిగిందంటే..

జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురానికి చెందిన చంద్రరావు, లలిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి చిన్న కొడుకు సుశాంత్ ఆరవ క్లాస్ చావుతున్నాడు. వాళ్ల మామయ్య మధు ఇంట్లో ఫంక్షన్ కోసం వెళ్ళాడు. ఫంక్షన్ కోసం.. వంటవాళ్ళు అందరూ హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. అదే సమయంలో మసాలా రుబ్బడానికి గ్రైండర్ ను కూడా సిద్ధం చేసారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన సుశాంత్ పొరపాటున గ్రైండర్ వైర్ ను పట్టుకున్నాడు. అది కట్ అయి ఉండటంతో విద్యుత్ ప్రవహించి సుశాంత్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.. సుశాంత్ ను గమనించిన బంధువులు వెంటనే అతడిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సుశాంత్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇంటినిండా బంధువులు, తెల్లవారితే సుశాంత్ మావయ్య కూతురి ఫంక్షన్.. కానీ సుశాంత్ మృతితో బంధువర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పండుగ వాతవారణం కనుమరుగై రోదనలతో అందరూ తమగుండేలు పగిలేలా రోదించారు. ఒక చిన్న ఏమరపాటు, నిర్లక్ష్యం ఒక చిన్న పిల్లవాడి ప్రాణం తీసింది.

ఎలక్ట్రికల్ వర్కర్స్, ఫ్లంబర్స్, కార్పెంటర్స్ లో కొందరు తమ వద్ద ఉన్న ఎలక్ట్రికల్ వస్తువల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. తెగిపోయిన వాటికి పడే పదే ప్లాస్టర్ వేస్తుంటారు. వర్క్ చేసే సమయంలో, తరలించే సమయంలో అవి విడిపోవటం లూజ్ గా ఉండటం జరుగుతుంది. అయితే ఇది గమనించకపోతే ఇలాంటి ఘటనలే జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు

Also read

Related posts