చింతల్: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్
విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్ బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్మెంట్ వాచ్‌మన్ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్లోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
షవరు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఫిలింనగర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సంధ్యారాణి(20) షేక్‌పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలో హాస్టల్లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో షవర్‌కు ఉరేసుకుంది.
కాసేపటి తరువాత మిత్రులు బాత్రూమ్ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. దీంతో హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా షవర్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్ మెసేజ్ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





