వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్ఎమ్ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు.
Also read
- Andhra Pradesh: మనిషి రూపంలో శివలింగం.. ఏడవ శతాబ్దం నాటి అద్భుత ఆలయం గురించి తెలుసా..?
- విద్యార్థిపై వార్డెన్ ల దాష్టీకం..ముగ్గురిపై కేసు నమోదు
- వాలెంటైన్స్ డే సాక్షిగా.. ఇన్స్టాగ్రామ్లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్లో ముగిసిన ప్రేమకథ..!
- 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య!
- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది





