బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనాల లేక ఇబ్బందులు – 10 కిలోమీటర్లకే వేళల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్న ప్రైవేటు వాహనదారులు
ఓ వైపు ఏఐ యుగం. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేని పరిస్థితి. ఆకాశాన్ని తాకే మేడలు. సమస్యను ముందుగానే కనిపెట్టే సామర్థ్యమున్న యంత్రాలు. చిటికలో డోర్ముందుకు డెలివెరీ సదుపాయాలు – ఇవన్నీ మారుతున్న మానవ జీవితంలో జరుగుతున్న పెనుమార్పులు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ మార్పులతో పాటే మానవత్వం కూడా మరుగున పడుతోంది. బతికున్నప్పుడు ఎలాగూ సుఖపడలేదు అంతిమ సంస్కారాలైనా గొప్పగా చెయ్యాలని అనుకునే జీవితాలున్నాయి మరోవైపు. కానీ వారి కోరిక కూడా మానవత్వం లేని మనుషుల మధ్య ఆవిరైపోతుంది. చావులోనూ దారిద్య్రం వీడని బతుకులు ఎన్నో ఉన్నాయి.
హృదయ విదారకం: కాయాకష్టం చేస్తేగానీ పూట గడవని కుటుంబాలు. మట్టిరోడ్లే వాళ్ల ఇంటికి మార్గాలు. అలాంటి చోట ఓ మనిషి ప్రాణం పోయినా ఆ మృతదేహం ఇంటికి చేరాలంటే పెద్ద యుద్దమే చెయ్యాల్సి వస్తుంది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చెయ్యాలని అనుకునే వారికంటే, ఆ పరిస్థితిని తమకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలనే మనుషులే ఎక్కువయ్యారు ఈ సమాజంలో. దానికి నిదర్శనమే బాపట్లలో జరిగిన హృదయ విదారక ఘటన. ద్విచక్ర వాహనం మీదే మృతదేహాన్ని దాదాపు 10 కిలోమీటర్లు తరలించాల్సి వచ్చింది. కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావుకు మంగళవారం గుండెనొప్పి వచ్చింది. వెంటనే అతన్ని సోదరులు బైక్పైన అతడ్ని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నాగేశ్వరరావును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. దీంతో ఆ మృతదేహాన్ని తరలించడానికి మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయా అని చూశారు. అవి లేకపోవడంతో స్థానిక ప్రైవేటు వాహనాలను వారు ఆశ్రయించారు. ఆటో వాళ్లు డబ్బులు ఎక్కువగా అడగడంతో తాము అంత ఎక్కువ మొత్తం చెల్లించుకోలేమని దాదాపు గంట సేపు పలు వాహనదారులను అడిగారు. చివరకు తమ దగ్గర డబ్బు లేకపోవడంలో 10 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది. యానాది కుటుంబానికి చెందిన నక్క నాగేశ్వరరావు కూలి పనులు చేసుకుంటూ, పంట పొలాల దగ్గర కాపలాగా ఉంటూ కుటుంబాన్ని సాకేవాడు.
‘ఆటోలో మృతదేహాన్ని తరలించడానికి రెండు వేల రూపాయలు అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేదు. చేసేదేం లేక నేనూ, మా బాబాయి బైక్ మీదే మా నాన్న శవాన్ని ఇంటికి తీసుకువచ్చాం.’ – మృతుడి కుమారుడు
ఇటువంటి ఘటనలు తాజాగా మన్యం జిల్లాలో జరిగాయి. ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాలు లేకపోవడంలో ఎంతో మంది పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.
Also read
- Students protest | నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్
- నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్‌పై ప్రత్యర్థి ఉండగానే..
- ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ
- నేటి జాతకము..13 ఫిబ్రవరి, 2026
- మహిళలు హనుమంతుడి పాదాలను తాకితే ఏమవుతుంది..? అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..





