పరుపుపై పడిన అగర్బత్తి – మంటలు అంటుకుని ఇంట్లో సామగ్రి దగ్ధం, మహిళ మృతి
దోమల బాధ తట్టుకోలేక వెలిగించిన అగరబత్తి ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. వెలిగించిన అగరబత్తి పరుపుపై పడి మంటలు చెలరేగడటంతో నిద్రలోనే మహిళ మరణించిన ఘటన విజయవాడ గుణదలలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం, గుణదల 1వ డివిజన్ డీడీ నాయుడు వీధికి చెందిన అగ్రహారపు సుభాషిణి (58) ఆదివారం రాత్రి దోమలు ఎక్కువగా ఉండడంతో వాటిని నివారించడానికి అగరబత్తి వెలిగించారు. అనంతరం ఇంట్లో నిద్రపోయారు. ఆమె గాఢనిద్రలోకి జారుకున్న అనంతరం ప్రమాదవశాత్తు ఆ అగరబత్తి అంటుకోవడంతో ఇళ్లు, ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. ఈ క్రమంలోనే నిద్రలోనే సుభాషిణి మృతిచెందారు.
సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో సుభాషిణి భర్త ఎంత పిలిచినా, ఆమె ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త, స్థానికులు సహాయంతో తలుపులను బలవంతంగా తెరవగా, మంచంపై కాలిన గాయాలతో సుభాషిణి చనిపోయి ఉండడం గమనించారు. వెంటనే మృతురాలి కుమారుడు మహేశ్ గుణదల పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి కూమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం మధ్యాహ్నం కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





