తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వేళ రాష్ట్రంలో వరుస షాకింగ్ ఘటన వెలుగు చూస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు బంగారు నాణేలను పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే పోలింగ్ తేదీ రోజూ నాణేలను పంపిణీ చేశారు. కానీ వాళ్లు ఇచ్చిన నాణేలు నకిలీవని తేలడంతో ఓటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరిసిల్లా మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఓ అభ్యర్థి బంగారు నాణేల పేరుతో నలికీ బంగారు నాణేలను పంపిణీ చేసిన ఘటన సిరిలిల్లా మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. నగరంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్నాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కో ఓటరుకు మూడు గురజల బంగారం ఇస్తున్నానని చెప్పి ప్రజలకు పంపిణీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే అభ్యర్థి పంపిణీ చేసింది అసలు బంగారం కాదని.. అవి రాగితో చేసిన నాణేలు అని తేలడంతో ఓటర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఓట్ల కోసం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేస్తావని సదురు అభ్యర్థిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా మేడ్చల్ జిల్లాలో సైతం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆలియాబాద్‌లోని 5వ వార్డులో నకిలీ వెండి నాణేల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి వెండి నాణేల పంపిణీ పేరుతో నకిలీ నాణేలను పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేశారని.. ఈ ప్రలోభాలపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రతిపక్ష పార్టీ నేతలు అంటున్నారు.
అయితే రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసినవి నకిలీ నాణేలు కావడంతో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అభ్యర్థుల వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు ఎలాంటి చర్యలు తీసుకంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also read
- 4 లేబర్ కోడ్ ల కు నిరసనగా పలు ప్రాంతాల్లో బ్లాక్ డే…… గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Garuda Purana: షాకింగ్! మరణానికి ముందు మనిషికి ఏమి కనిపిస్తుంది? గరుడ పురాణం రహస్యాలు
- Lucky Zodiac Signs: ఏప్రిల్ నెలలో వారికి అదృష్ట దేవత కటాక్షం..! ఇందులో మీ రాశి ఉందా?
- బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ కుప్పకూలిన ప్రభుత్వ టీచర్.. అక్కడికక్కడే మృతి!
- తాగిన మైకంలో దారుణం.. భార్య పిల్లలపై దాడి.. భార్య, కొడుకు మృతి, కొన ఊపిరితో కూతురు!





