ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విషం తాగినట్లు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తలతోపాటు వారి ముగ్గురు పిల్లలు రాత్రి సమయంలో పాలలో విషం కలిపి తాగారని సమాచారం అందుతోంది. ఉదయం వారు మేల్కొనకపోవడంతో, ఇరుగుపొరుగువారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి చూడటంతో ఐదుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఈ సంఘటన మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖప్పర్పూర్ గ్రామంలో జరిగింది. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరిస్తున్నామని, కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ప్రశ్నిస్తున్నామని, మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపామని పోలీసులు తెలిపారు. సామూహిక ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ దంపతలు మొదట తమ ముగ్గురు పిల్లల పాలలో విషం కలిపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఈ దారుణమైన చర్య ఎందుకు తీసుకున్నారనే దానిపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే ఆ కుటుంబం విషాదకరంగా మరణించడంతో ఆ ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమేమిటో బంధువులు, పొరుగువారు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





