Jagan’s visit to Ibrahimpatnam: 2, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో మరో ఆపశృతి చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి సీఎం బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి సమీపంలో వైసీపీ నేత దుర్మరణం చెందారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన చిల్లకల్లు గ్రామ వైసీపీ కార్యకర్త రాంబాబు (45) వెళ్లారు. జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన తొక్కిసలాటలో రాంబాబు కిందపడిపోయాడు. గమనించిన వైసీపీ కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా జగన్ తాడేపల్లి నుంచి 35 KM దూరంలోని ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు 5 గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జన సమీకరణతో గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుకుని ప్రజలకు ఇబ్బందులకు గురిచేశారు. ఇబ్రహీంపట్నం రింగురోడ్డు, తదితర ప్రాంతాల్లో బైక్ తో స్టంట్లు చేస్తూ అలజడి సృష్టించారు. జోగి రమేశ్ సహా పలువురు వైసీపీ నేతలు అక్కడే ఉన్నా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- షాకింగ్: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర
- అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం
- గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- భర్త గొంతు నులిమి చంపిన భార్య
- గుంటూరులో అమానవీయ ఘటన





