అతను రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. భర్త నుంచి దూరంగా వెళ్లి భార్యా పిల్లలు విశాఖపట్నంలో ప్రస్తుతం నివాసం ఉన్నారు. భర్త నుంచి న్యాయం కోసం భార్య ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే భర్త మరో మహిళతో సహజీవనం మెుదలుపెట్టాడు. ఇంతలోనే ఇద్దరు మధ్య తలెత్తిన గొడవతో సహజీవనం చేస్తున్న మహిళను విచక్షణారహితంగా కత్తితో పొడిచిన హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి మహిళా ఆర్తనాదాలు వినిపించాయి.. కసితో రగిలిపోతున్నట్లు శేషగిరి రావు అనే వ్యక్తి కత్తితో మహిళపై పదేపదే విచక్షణ లేకుండా దాడి చేస్తున్నాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకోగా కరుణ అనే మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. నిండు గర్భిణీ అయిన మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు శేషగిరి రావు. కత్తితో 14 కత్తి పోట్లు పొడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరుణ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సహజీవనం చేస్తున్న కరుణ అనే మహిళపై అనుమానంతోనే శేషగిరిరావు ఈ దారుణ హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. భార్యతో విభేదాల కారణంగా ఆమెతో దూరంగా ఉంటున్నాడు. మరో మహిళతో సహజీవనం చేస్తూ వేరు కాపురం పెట్టాడు శేషగిరి రావు. అయితే సహజీవనం చేస్తున్న కరుణపై సైతం శేషగిరి రావు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నిండు గర్భిణీ అయిన ఆమెను కత్తితో 14 సార్లు పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న కరుణను చూసిన స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. దీంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కరుణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
- AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు
- బారువలో నంది విగ్రహం ధ్వంసం
- Rajahmundry:కల్తీ పాలు కేసులో మరో మృతి… మృతుల సంఖ్య 17కి పెరుగుదల.
- మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి





