కర్నూలు టౌన్: తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన కుమార్తెతో పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. గమనించిన తల్లీకుమార్తె ఇంట్లోకి వెళ్లగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వారిని తోసేసి పరారయ్యారు. ఈ క్రమంలో లక్ష్మీదేవికి గాయాలయ్యాయి. 14 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Kidney Patients: కిడ్నీ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది..
- గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా……
- Moon Double Transit: శని జయంతి నాడు చంద్రుడి డబుల్ ధమాకా.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు.. ఇక అంతా శుభమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!




