SGSTV NEWS online
Andhra PradeshCrime

భార్యపై కోపంతో బాలికకు వివాహం


ప్రకాశం జిల్లాలో ఓ తండ్రి నిర్వకం ముండ్లమూరు (ప్రకాశం జిల్లా) : భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లటంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త మైనార్టీ తీరని కుమార్తెకు వివాహం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు ఎస్‌సి కాలనీకి చెందిన తొట్టెంపూడి వెంకటరావుకు, పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాణికి 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వెంకటరావుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆరు నెలల క్రితం రాణి పుట్టింటికి వెళ్లడంతో వెంకట రావు కోపం పెంచుకుని మోడల్‌ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె (బాలిక)కు ముండ్లమూరు మండలం, బసవాపురం గ్రామానికి చెందిన గతంలో వివాహం జరిగిన యువకుడికి ఇచ్చి రెండో వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈ విషయం భార్యకు కూడా చెప్పకుండా సంక్రాం తి సెలవుల్లో మల్లవరం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కొద్దిమంది బంధువులతో కలిసి రహస్యంగా వివాహం చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి రాణి ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

Also read

Related posts