హైదరాబాద్లో పకడ్బంధీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను సీజ్ చేస్తున్నారు.. అయినా.. కొంతమంది ఏం తెలియనట్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు.. వాహనాన్ని ఆపిన ఎస్ఐనే ఢీకొట్టారు.. దీంతో ఎస్ఐ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే సహించేది లేదు.. తాగి వాహనం నడపొద్దు.. మీతో పాటు.. ఇతరు ప్రాణాలను బలికొనవద్దు.. అంటూ పోలీసులు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ ఆపేందుకు పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు.. పకడ్బంధీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను సీజ్ చేస్తున్నారు.. అయినా.. కొంతమంది ఏం తెలియనట్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు.. వాహనాన్ని ఆపిన ఎస్ఐనే ఢీకొట్టారు.. దీంతో ఎస్ఐ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఎస్ఐ మధు ఓ కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. కారును ఆపేందుకు వస్తున్న ఎస్ఐ మధుపైకి కారు దూసుకొచ్చింది.. దీంతో మధు ఒక్కసారిగా కారు బానెట్ పై పడిపోయారు.. కారు బానేట్ పై ఉండగా ఎస్సై మధును సుమారు 400 మీటర్ల వరకు కారు డ్రైవర్ తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం మాల్ అనే గ్రామంలో ఎస్ఐ మధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో.. ఎస్ఐ ను కారు ఢీకొట్టి హైదరాబాద్ వైపు దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే ఎస్సై దూకేశారు. ఎస్సై మధు కారు బానెట్ పై ఉండాగానే యాచారం అంబేద్కర్ చౌరస్తాలో కారు.. బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.. యువతికి చేయి విరిగింది. ఇబ్రహీంపట్నం వద్ద కారును నిలిపి పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.. మాల్ పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది తిరిగి ఎస్ఐ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. యాచారం కారు ఘటనలో ఎస్సై మధుకు గాయాలు కాగా.. మరో యువతికి చెయ్యి విరిగినట్లు పేర్కొంటున్నారు.
Also read
- పిజిఆర్ఎస్ ఫిర్యాదులను పరిష్కరించని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది…
- తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..?
- హనుమాన్ జయంతి 2026: హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!




