SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

మద్యం మత్తులో మహిళ హల్చల్.. వైన్స్ సిబ్బందిపై దాడి



మద్యం మత్తులో ఓ మహిళ నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మద్యం మత్తులో ఓ మహిళ నడిరోడ్డుపై  వీరంగం సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఫుల్ గా తాగిన యువతి.. వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడి చేయడం కనిపించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలోని రైలు పేట ప్రాంతంలో ఉన్న శ్రీనివాస వైన్స్లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించిన సదరు మహిళ, షాప్ సిబ్బందితో అనవసరంగా వాగ్వాదానికి దిగి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. కేవలం మాటలతో ఆగకుండా, వైన్స్ షాపు లోపలికి వెళ్లి అక్కడి సిబ్బంది పై విచక్షణారహితంగా దాడికి దిగింది. సదరు మహిళ సిబ్బందిని కొడుతుండగా, చుట్టుపక్కల ఉన్నవారు వారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం తగ్గలేదు.

బహిరంగ ప్రదేశంలో ఒక మహిళ ఇలా మద్యం మత్తులో హల్చల్ చేయడం చూసి స్థానికులు విస్తుపోయారు.



ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

Also read

Related posts