చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య.. కోటప్పకొండ, చిలకలూరిపేట మీదుగా గుంటూరు వైపు వెళుతున్నారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరుకి చెందిన దండా వీరయ్య, చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన షేక్ మస్తాన్ వలీలను ఎస్సై ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వాహనంపై ఉన్న మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని చిలకలూరిపే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





