SGSTV NEWS online
Andhra PradeshCrime

నాగమణి, జ్ఞానమ్మ, పద్మ.. మామూలు లేడీస్ కాదమ్మ.. కళ్లు మూసి తెరిచేలోపే





విశాఖపట్నంలో జ్యూవెలరీ షాపులను టార్గెట్ చేసిన మహిళా దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలో చోరీకి యత్నించిన ఏడుగురు నిందితులను సిబ్బంది అప్రమత్తతతో పట్టుకున్నారు. కస్టమర్ల వేషంలో వచ్చి ఆభరణాలను చీరల్లో దాచి పారిపోవాలని చూసిన వారి ప్రయత్నం విఫలమైంది.

ఈ లేడీస్ మామూలోళ్లు కాదు.. టిప్ టాప్‌గా తయారవుతారు.. గోల్డ్ జ్యువెల్లరీ షాప్‌లోకి అచ్చమైన కస్టమర్లలా ఎంట్రీ ఇస్తారు.. సిబ్బంది ఆదమరిచి ఉన్నారో.. గోల్డ్‌తో ఉడాయిస్తారు .. అయితే వారి ఆటలు సాగనివ్వకుండా చేశారు షాప్ యజమానులు.. విశాఖపట్నంలో జ్యూవెలరీ షాపులను లక్ష్యంగా చేసుకున్న మహిళా దొంగల ముఠాల హల్‌చల్ తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల వలె నటిస్తూ షాపులలోకి ప్రవేశించి, సిబ్బంది ఆదమరిస్తే బంగారు ఆభరణాలతో ఉడాయించడానికి ఈ ముఠాలు ప్రయత్నించాయి. అయితే, షాపుల యజమానులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో దొంగల ఆటలు సాగలేదు..



మహిళా గ్యాంగ్.. చోరీలకు ప్రయత్నించి.. అడ్డంగా దొరికిపోయారు.. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలలో చోరీలకు పథకం రచించారు. కస్టమర్ల మాదిరిగా వచ్చి, ఆభరణాలను కొప్పులో లేదా చీరల్లో దాచి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే విషయాన్ని గ్రహించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెండు ముఠాలకు చెందిన మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గాజువాకలో విజయవాడకు చెందిన నాగమణి, జ్ఞానమ్మ, పద్మను అదుపులోకి తీసుకోగా, పెందుర్తిలో ఖమ్మం జిల్లాకు చెందిన నాగేంద్రమ్మ, రేణుక, కృష్ణవేణి, వెంకటరమణమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ గ్యాంగ్ దొంగలను పట్టుకుని.. విశాఖ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read

Related posts