కామారెడ్డి జిల్లాలో ఘటన
బీర్కూర్: బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలం వీరాపూర్నుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) ఉన్నారు. ప్రహ్లాద్ రోజూవారీ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని. వారిని ఏ విధంగా చదివించి, వివాహాలు చేయాలని బాధపడేవారు.
ప్రస్తుతం సౌందర్య 9 నెలల గర్భిణి. ఈ నెల 26 లోపు కాన్పు అవుతుందని వైద్యులు తెలిపారు. నాలుగో సంతానం కూడా కుమార్తె జన్మించొచ్చనే భయంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తుండగానే విష ద్రావకం తాగారు. కుటుంబీకులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఆదివారం మృతదేహానికి శవ పరీక్ష చేసి కుటుంబీకులకు అప్పగించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. కాగా ప్రహ్లాద్ గతంలోనూ మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబీకులు కాపాడారు.
Also read
- సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
- విశాఖలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగా మాయం
- విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
- ఇంత క్రూరత్వమా?.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
- అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా? ఎల్కేజీ బాలుడిపై ఉపాధ్యాయురాలి పైశాచికత్వం..!





