ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందితే ప్రాణాలతో బటయపడుతున్నారు.. చాలా సందర్భాల్లో స్పాట్లోనే చనిపోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో కొడుకు గుండెపోటుతో మరణించగా.. అతని మరణాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి కూడా.. గంట వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతలో కొడుకుకి గుండెపోటు వచ్చి.. మృతి చెందాడు.. అయితే.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా అదే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామంలో జరిగింది.. తండ్రి కొడుకు గంట వ్యవధిలో ఇద్దరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం..
నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు..మున్నీరుగా విలపించారు. తండ్రి కొడుకు చనిపోయిన బాధను ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు ఈ క్రమంలో గంట వ్యవధిలో తండ్రి ఎరుకల రాజేశం కూడా మృతి చెందాడు. దీంతో.. తండ్రీకొడుకు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు.. గుండెలవిసేలా రోదించారు..
గంట వ్యవధిలో.. తండ్రికొడుకు చనిపోవడంతో.. ఇద్దరికీ కలిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువై సంవత్సరాల క్రితం ఇదే కుటుంబంలో.. రాజేశం తల్లిదండ్రులు ఓకే రోజు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. మొత్తానికి..ఈ కుటుంబం ఇలాంటి బాధల నుంచి బయటపడటం లేదని పేర్కొంటున్నారు
Also Read
- ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం..
- అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు.. పోక్సో కోర్టు ఆదేశాలతో FIR నమోదు!
- Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..
- Lord Shani: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!
- శివుడిని సోమవారం మాత్రమే ఎందుకు పూజిస్తారో తెలుసా?





