పవిత్రమైన “ధనుర్మాసం” ప్రారంభం అయ్యింది. ధనుర్మాసం ప్రారంభంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో నెలరోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలది. హరిదాసులు “హరిలో రంగ హరి” అంటూ అక్షయపాత్రతో ఇంటింటికి తిరుగుతూ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ధనుర్మాసం ప్రారంభమవ్వగానే హరిదాసుల సందడి మొదలైనట్టే అయితే వీరు ధనుర్మాసంలోనే ఎందుకు వస్తారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం మొదలైంది. తలమీద అక్షయపాత్ర, చేతిలో చిడతలతో “హరిలో రంగ హరి” అంటూ హరిదాసులు పల్లె బాట వట్టారు. వీరు శివకేశవుల కీర్తనలు అలపిస్తూ ఇంటింటికి తిరుగుతుంటే వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. కొందరు కాలినడకన , మరికొందరు వాహనాలపై తిరుగుతూ సాంప్రదాయాన్ని చాటుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడిపందాల రాయుళ్లు కోడిపుంజులను పోరుకు సిద్ధం చేస్తుంటారు. పల్లెలు , పట్టణాలు తేడాలేకుండా ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెడుతుంటారు . వాటిలో గొబ్బిళ్ళు పెట్టి , పూలతో అలంకరిస్తుంటారు. పండుగ సమీపిస్తుందనగా మన తెలుగువారి ప్రాచీన సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, పోకుండలు, జిలేబీలు, జంతికలు వంటివి వండుతారు. అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఈ పిండివంటలకు సంక్రాంతి సెలవులకు మనవళ్లు, మనవరాలు, బంధుమిత్రులు వస్తుంటారు.
ఇక ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ధనుర్మానం విశిష్టమైనది. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉండే ఈ మాసాన్ని మార్గశిర మాసం అనికూడా అంటారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని విశ్వవాసం. ఇక ఆ శ్రీ మహావిష్ణువులో (రంగనాథుడు) ఐక్యమైన మహా భక్తురాలు ఆండాళ్ అమ్మ వారు. ఆమె చూపిన భక్తి మార్గమే ధనుర్మాసానికి ప్రాణం. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో ప్రతిరోజూ తిరుప్పావై పారాయణం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఈ ధనుర్మాసం నెల రోజులు గ్రామాలలో ఆలయాల వద్ద తెల్లవారుజామున భాజా భజంత్రీలు, కోలాటాలు, చలి మంటలు, భోగి మంటల సందడి మొదలువుతుంది. ఈ నెల రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో హరిదాసు సంకీర్తనలు కనిపిస్తాయి.. వినిపిస్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు అంటారు పెద్దలు. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అనే నానుడి ఉంది.
హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే ధనధాన్యాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించే వారే హరిదాసులు. పండుగ నెల ధనుర్మాసంలో నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు, దానాలను హరిదాసులు స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయపాత్ర (పంచలోహ పాత్ర )వారి శిరస్సుపై ధరిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పట్టించి, అక్షయపాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గ్రామాలలో, పల్లెలలో ఇంటింటికి తిరిగి హరిదాను తమ స్వగృహానికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరి ఏమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు ఇంటికి వెళ్లాక ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది
Also Read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్‌పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్‌చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్‌కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి




