SGSTV NEWS online
CrimeTelangana

Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..



Acid attack: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని దుండగులు కెమికల్తో దాడికి పాల్పడ్డారు. హెల్మెట్ ధరించి ఉండటంతో ఈ దాడిలో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

బాధితురాలు హన్మకొండకు చెందిన 21 ఏళ్ల సునందగా గుర్తించారు. ఆమె ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. హన్మకొండ నుంచి వెంకటాపూర్ గ్రామానికి స్కూటీపై బయల్దేరిన ఆమె కడిపికొండ గ్రామ పంచాయతీ సమీపానికి చేరుకోగానే దుండగులు ఆమెను అడ్డగించారు. అకస్మాత్తుగా ఆమెపై కెమికల్ను చల్లారు. హెల్మెట్ ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో యువతి కేకలు వేయడంతో దాడికి పాల్పడిన వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు పరుగున వచ్చి యువతిని రక్షించారు.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చికిత్స నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. హెల్మెట్ ధరించడంతో ముఖానికి తీవ్ర స్థాయిలో ప్రమాదం తప్పిందని వైద్యులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎవరు? ఎందుకు దాడికి పాల్పడ్డారు? వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందా? ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరే ఇతర కోణం ఉందా? అన్న దిశగా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, దుండగుల కదలికలపై ఆధారాలు సేకరిస్తున్నారు.

Also Read

Related posts