SGSTV NEWS online
Andhra PradeshCrime

Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది



చంపేశాడు.. ఇద్దరిని అత్యంత కిరాతకంగా హత్య చేసేశాడు. అతనేమీ కరుడు గట్టిన నేరస్థుడు కాడు. అసాంఘీక కార్యకలాపాల్లో మునిగి తేలేవాడు అంతకంటే కాదు. అయినా మరో ఇద్దరు మైనర్లను వెంటబెట్టుకుని వెళ్లి మరీ కసితీరా నరికి చంపాడు. తన అక్క కళ్లలో కన్నీళ్లు చూడలేక ఆ కుటుంబాన్నే అడ్డు తొలగించుకోవాలన్న ప్లాన్ వేశాడు.

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన సాంబశివరావుకు, చిలకలూరిపేట మండలం గణపవరానికి చెందిన సాహితికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. సాంబశివరావు తాడికొండలోని ఓ ప్రవేటు కాలేజ్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే వీరిద్దరికి సంతానం లేకపోవడంతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆరు నెలల క్రితమే ఇద్దరికి విడాకులయ్యాయి. మరోవైపు సాహితి వేరొక పెళ్లి కూడా చేసుకుంది. మధ్యలో ఆగిపోయిన బీటెక్‌ను కొనసాగిస్తోంది. అయితే సాహితిపై ద్రుష్ఫ్రచారం చేయడాన్ని సాంబశివరావు కొనసాగిస్తున్నాడు. అతని స్నేహితులకు ఆమె గురించి చెడుగా చెబుతున్నాడు. దీంతో సాహితి ఇంటికి వచ్చి కన్నీరు పెట్టుకుంటోంది. ఈ విషయం ఆమె తమ్ముడైన రోహిత్‌కు తెలిసింది. పెళ్లైన దగ్గర నుండి అక్క బాధపడటాన్ని గమనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సాంబశివరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

నిన్న ఆదివారం సాంబశివరావు ధూళిపాళ్ల ఇంటిలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. పాలిటెక్నిక్ చదువుతున్న రోహిత్.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తన స్నేహితులైన రవికుమార్, జావెద్‌తో కలిసి బైక్‌పై దూళిపాళ్ల చేరుకున్నారు. స్నేహితులు బయట వేచి ఉండగా రోహిత్ సాంబశివరావు ఇంటిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దాడిని అడ్డుకోబోయిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే చనిపోగా కృష్ణకుమారి గుంటూరు జిజిహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది.

హత్యల సమయంలో కేకల వేయడంతో చుట్టుపక్కల జనం పోగై నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి పారిపోయిన ముగ్గురు మైనర్లు ఐదు కిలోమీటర్ల తర్వాత స్థానికులకు దొరికిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు వారిపై దాడి చేశారు. అయితే పోలీసులు అడ్డుకుని నిందితులను సత్తెనపల్లి పీఎస్‌కు తరలించారు. అక్క బాధపడటాన్ని చూడలేక ఇద్దరిని ఒకేసారి హత్య చేయడం కలకలం రేపింది. ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు మైనర్లే కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చికెన్ స్టాల్‌లో కత్తిని దొంగలించి తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts