అనకాపల్లి జిల్లా పరవాడలో పోలీసులు గంజాయి దందాకు అడ్డుకట్ట వేశారు. అనుమానంతో ఇద్దరిని పట్టుకొని ప్రశ్నించగా, 425 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఒకరు, అనకాపల్లికి చెందిన మరొకరు కలిసి చిన్న ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్న ఈ పెడ్లింగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు.
అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసులు.. అక్రమార్కుల భరతం పడుతున్నారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతూ మరింత మందికి ప్రోత్సహిస్తున్న వారి తాట తీస్తున్నారు. తాజాగా కీలక సమాచారం అందుకున్న పోలీసులు, డీఎస్పీ విష్ణు స్వరూప్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. సీఐ మల్లికార్జున నేతృత్వంలో ఓ ఆపరేషన్ చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు గుర్తించి వారి కదలికలను పసిగట్టారు. చివరకు ఇద్దరినీ పట్టుకొని ప్రశ్నించి వారి దగ్గర ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. దీంతో ఘాటు వాసనతో గంజాయిని గుర్తించారు. దాదాపు 425 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా కు చెందిన రశ్మి రంజన్ బెహరా, అనకాపల్లి జిల్లా కొత్తూరు సిరసపల్లికి చెందిన సత్యనారాయణ ను అరెస్టు చేశారు. దీంతో పరవాడ ప్రాంతంలో నడిచిపోతున్న గంజాయి పెండింగ్ నెట్వర్క్ ను ఛేదించి నిర్వీర్యం చేశారు పోలీసులు.
చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి.. గల్లీ గల్లీలో తిరిగి..
ఒడిస్సా కు చెందిన రంజన్ బెహరా.. అనకాపల్లికి చెందిన సత్యనారాయణ తో జత కలిశాడు. ఇద్దరు కలిసి గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించేశారు. ఎండు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా.. జిప్ లాక్ కవర్లలో పెట్టి అమ్మేస్తున్నారు. పరవాడ, తానాం, తాడి, లంకెలపాలెం ప్రాంతాల్లో గల్లీ గల్లీలో తిరుగుతూ.. అడిగినవారికి అప్పగిస్తున్నారు. యువతను మత్తులో ముంచేస్తున్నారు. 5 గ్రాముల గల ఒక్కో ప్యాకెట్ను రూ.200 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. గంజాయి పెడలింగ్ నెట్వర్క్ ను చేదించి నిర్వీర్యం చేసిన సీఐ మల్లికార్జున కానిస్టేబుళ్లు లోవరాజు, పోలిరాజు బృందాన్ని డిఎస్పి విష్ణు స్వరూప్ అభినందించారు.
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





