వేరే కులం వ్యక్తిని ప్రేమించింది ఆ యువతి. ఈ విషయం ఆమె కుటుంబానికి తెలిసింది. బయట జనానికి తెలిస్తే పరువు పోతుందని భావించారు. యువతి తండ్రి, సోదరుడు కుమార్తె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ఝునాగంజ్ ప్రాంతంలో వెలుగుచూసింది.
తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని.. ఆ యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ప్రాణాలతో లేకపోయినా అతనే తన భర్త అంటూ.. మృతదేహాన్ని వివాహం చేసుకుంది.. ఆ యువతి. జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉంటాలని నిర్ణయించుకుంది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగింది. నాందేడ్ నగరంలోని జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్ అనే యువకుడు, ఆంచల్ అనే యువతిని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఆంచల్ కుటుంబానికి తెలిసింది. ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు.. సక్షం టేట్‌ను హెచ్చరించారు. తర్వాత.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్‌తో పాటు సోదరులు సాహిల్, హిమేష్.. సక్షం టేట్‌ను హత్య చేశారు. తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. ఆ తర్వాత రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు మరో ఇద్దరు సహకరించారు.
చనిపోయినా, బతికున్నా అతడే తన భర్త అంటూ డెడ్ బాడీని ఆంచల్ పెళ్లాడింది. మృతదేహానికి సింధూరం పెట్టి అతనే తన భర్త అని చెప్పింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని అంటోంది. కన్న తండ్రి.. తోడబుట్టిన సోదరులు.. ప్రేమికుడిని చంపేశారు. కానీ. తన ప్రేమను చంపలేరంటూ బాధతో కన్నీటిపర్యంతమైంది ఆంచల్.
Also Read
- కార్పొరేట్ స్కూల్ సూపర్వైజర్ కామ చేష్టలు
- వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి
- వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడి
- కట్టుకోబోయేవాడే చంపాడు..
- విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..





