హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్‌లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హాస్సిటల్ రెనోవేషన్ కోసం ఇటీవలే అక్కడ పనులు ప్రారంభించనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్మికులు సెంట్రింగ్ వేయగా.. ప్రమాదవశాత్తు అది కూలిపోయింది. దీంతో స్లాబ్ పెచ్చులు అక్కడ పని చేస్తున్న కార్మికులపై పడిపోయాయి. దీంతో ముగ్గురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే మరి కొందరు గాయపడ్డారని.. గమనించి సిబ్బంది వెంటనే వారిని హాస్పిటల్‌లోకి తరలించి.. చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే హాస్పిటల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Also Read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





