సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం నేరాలతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిరుద్యోగులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసగాళ్ళు నిండా ముంచుతున్నారు. అమాయక నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఆ వివరాలు ఇలా..
సైబర్ మోసాల పట్ల అవగాహన లేని నిరుద్యోగులు అత్యాశకు పోయి ఆన్ లైన్లో పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు నిరుద్యోగులే టార్గెట్‌గా ఏదో రకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 5న యువకుడి వాట్సాప్‌కు సైబర్ కేటుగాళ్లు ఓ మెసేజ్ పంపారు. దీంతో సదరు యువకుడు నాలుగు రోజుల పాటు సైబర్ నేరగాళ్లతో చాటింగ్ చేశాడు. పార్ట్ టైం జాబ్ పేరిట ఈజీగా మనీ సంపాదించవచ్చని వాట్సాప్‌లో యువకుడితో చాట్ చేశారు. ఆ తర్వాత యువకుడిని సైబర్ నేరగాళ్లు తమ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకున్నారు.
ఇంటి వద్ద ఉంటూ పార్ట్ టైం జాబ్‌గా జర్మనీలోని హోటల్లో రూమ్స్ బుకింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దీంతో ఈ నెల 10న యువకుడు తన ఫోన్ నంబర్‌తో ఐడీ క్రియేట్ చేసుకుని తన వివరాలను వారికి షేర్ చేశాడు. ఈ నెల 10న రూ. 800 పంపించగా.. సైబర్ మోసగాళ్లు రూ. 1020 లాభం చూపించారు. ప్రతిరోజు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు సంపాదించవచ్చని కేటుగాళ్ళు నమ్మించారు. ఇలా పలుమార్లు యువకుడు పెట్టిన పెట్టుబడికి మొత్తం రూ.40 వేలు లాభం వచ్చినట్లు మెసేజ్ పంపారు. కానీ ఆ డబ్బులను తమ వద్దనే పెట్టుకున్నామని, వాటికి మరింత తాము జమ చేస్తామని నమ్మించారు. అయినా యువకుడిని వదలకుండా కేటుగాళ్లు ప్రలోభాలకు గురి చేశారు. దీంతో బంధువు వద్ద ఐదు లక్షల రూపాయలను అప్పుగా తీసుకువచ్చి పెట్టుబడి పెట్టాడు. ఇలా మొత్తం రూ. 8,42,663లను పెట్టుబడి పెట్టించారు.
నీకు 90 పాయింట్లు వచ్చాయి, 100 పాయింట్లు పూర్తయితే లాభం పూర్తిగా చేతికి వస్తుందని నమ్మించారు. తక్కువగా ఉన్న 10 పాయింట్లను లక్ష రూపాయలతో కొనుగోలు చేయాలని నేరగాళ్లు ఒత్తిడి చేశారు. పార్ట్ టైం జాబ్ పేరుతో జరిగిన విషయాన్ని యువకుడు తన ఫ్రెండ్స్‌కు చెప్పాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయావని ఫ్రెండ్స్ చెప్పడంతో చౌటుప్పల్ పోలీసులను యువకుడు ఆశ్రయించాడు. వారి సూచనతో 1940 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




