Bengaluru: పేషంట్లను లైంగికంగా వేధించే డాక్టర్లు కూడా ఉంటారు. బెంగళూరులో ఈ డాక్టర్ నిర్వకాన్ని పేషంట్ ధైర్యంగా వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగళూరులో చికిత్స కోసం వచ్చిన మహిళా పేషంట్ ను వైద్యుడు లైంగికంగా వేధించాడు. బెంగళూరు సమీపంలోని అనేకల్‌లో ఒక రేడియాలజిస్ట్ రోగినిని లైంగికంగా వేధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పితో స్కానింగ్ సెంటర్‌కు వచ్చిన మహిళను, చికిత్స కోసం వచ్చిన ఆమెను డాక్టర్ జయకుమార్ అనే వ్యక్తి తన వృత్తిని దుర్వినియోగం చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భర్తతో కలిసి వచ్చిన ఆ మహిళకు వైద్యం చేయాల్సిన డాక్టర్, బదులుగా ఆమెను భయపెట్టి, బెదిరించి, అమానుషంగా ప్రవర్తించాడు.
స్కానింగ్ ప్రక్రియలో జయకుమార్ మహిళ చేయిని అనుచితంగా తాకాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను కూడా స్కాన్ పేరుతో తడిమాడు. భయపడి నిరసన తెలిపిన మహిళను బెదిరించాడు. “ఎవరికీ చెప్పావా అంటే చంపేస్తాను” అని బెదిరించాడు. ధైర్యంగా ఆ మహిళ మొబైల్లో ఈ ఘటనను రికార్డ్ చేసుకుంది. ఆ ఆధారాలతోనే అనేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ ఘటన వైద్య వృత్తిలో రోగుల బలహీనతను దుర్వినియోగం చేసుకునే డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యవహారం మరోసారితెరపైకి తెచ్చింది.
తెల్ల కోటు ధరించిన ఈ దుర్మార్గులు బాధితుల గౌరవాన్ని మాత్రమే కాదు, వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో న్యాయం ఆలస్యమైతే మరిన్ని నేరాలకు ప్రోత్సాహం లభిస్తుందని నెటిజన్లు ఆదోళన వ్యక్తంచేస్తున్నారు.
అనేకల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రికార్డింగ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. కానీ నిందితుడు ఇంకా అరెస్టు కాలేదు. పోలీస్ స్టేషన్‌కు పిలిచి, కొంతసేపు అడిగి వదిలేశారు. ఈ వైఖరి పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బాధితురాలు ఈ ఘటనతో తీవ్ర ట్రామాకు గురైంది. ప్రస్తుతం బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read
- Vijayawada: విజయవాడలో నడి రోడ్డుపై మహిళ దారుణ హత్య
- పట్ట పగలే దారుణం.. కళ్లల్లో కారం కొట్టి…
- లక్కీ డ్రా.. కేవలం రూ.250లకే ఇల్లు సొంతం చేసుకోవంటూ ప్రచారం..! పోలీసుల ఎంట్రీతో..
- అక్కాతమ్ముళ్లు అయి ఉండి ఇదేం పని.. ఆ ఆరుగురితో కలిసి..
- అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?





