శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. గురువారం పలాసలోనీ KT రోడ్లోనీ టి దుకాణంలో వైశ్యరాజు. లక్ష్మీ నారాయణరాజు అనే వ్యక్తి టీ తాగుతుండగా.. కొంతమంది దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో కిడ్నాప్ కదా సుఖాంతం అయింది. సివిల్ వివాదం నేపథ్యంలోనే నిందితులు కిడ్నాప్ కి యత్నిచారని పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలాస కేటి రోడ్లో కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. కేటి రోడ్లోనీ ఒ టీ దుకాణంలో వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అనే వ్యక్తి టీ తాగుతుండగా ఆముదాలవలసకు చెందిన పొట్నూరు వేణుగోపాల్ అనే వ్యక్తి రెండు కార్లలో తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి ఆయనను బలవంతంగా అక్కడ నుంచి కారులో తీసుకువెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ భార్య కాశీబుగ్గ పోలీసులను సంప్రదించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. CC కెమెరాలో లక్ష్మీ నారాయణరాజు నీ బలవంతంగా తీసుకువెళుతున్నట్టు చూసి నిందితులు ఆమదాలవలసకు చెందిన పొట్నూరు వేణుగోపాలరావు, అతని అనుచరులుగా పోలీసులు గుర్తించారు.
సివిల్ వివాదంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఆమదాలవలస కి చెందిన లక్ష్మీ నారాయణ పలాసలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆమదాలవలసలో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉండగా దానిని పొట్నూరు వేణుగోపాల్ అనే వ్యక్తికి అద్దెకి ఇచ్చారు. అయితే తర్వాత దానిపై రూ.65 లక్షలు నగదు ఇచ్చాడు వెణుగోపాల్. తర్వాత లక్ష్మీనారాయణకు ఉన్న బ్యాంకు రుణం కూడా తీర్చాడు. ఇలా రూ.కోటి 50 లక్షల వరకు వేణు గోపాల్ కి బాకీ పడ్డాడు లక్ష్మీ నారాయణ. వేణు గోపాల్ కి బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి వేరే వ్యక్తి అమ్మే ప్రయత్నం చేస్తుండగా అది తెలిసి వేణుగోపాల్ గురువారం లక్ష్మీ నారాయణ రాజును బలవంతుగా ఆమదాలవలస తీసుకువెళ్ళి అతనితో బిల్డింగ్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించాడు.
లక్ష్మీనారాయణ భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కాశీబుగ్గ పోలీసులు వెంటనే ఆమదాలవలస పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో విషయం తెలిసిన నిందితులు ఆమదాలవలస తీసుకువచ్చిన లక్ష్మి నారాయణ రాజును తిరిగి ప్రయాణం అవుతూ నరసన్నపేట వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కిడ్నాపర్స్ చర నుంచి బయటపడ్డ లక్ష్మీనారాయణ కాశీబుగ్గ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





