నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. 15 ఏళ్లుగా కట్టడం నిలిసివేసిన అపార్ట్మెంట్ నుంచి భరించలేని దుర్వాసన.. వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు.. దీంతో ఒక డెడ్ బాడీ బయటపడింది. గుర్తు తెలియని శవంగా గుర్తించి పోలీసులు వివరాలు సేకరించారు. వేలిముద్రల ఆధారంగా శవం మనోజ్ కుమార్ అనే నేరస్తుడిదని తేలింది. పలు నేరాలు చేస్తూ స్నేహితుల మధ్య వచ్చిన తగాదా హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
తిరుపతి జిల్లా గాజుల మండ్యం పీఎస్ పరిధిలో గుర్తు తెలియని శవం కలకలం రేపింది. రేణిగుంట తిరుపతి రోడ్డు లో ఉన్న లక్ష్మిపురం కాలనీలో నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్మెంట్లో లభించిన యువకుడి డెడ్ బాడీ స్థానికుల్లో భయాందోళనకు కారణం అయ్యింది. రెండు రోజులుగా భరించలేని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఆ ప్రాంతంలో ఏదో చనిపోయిందని భావించారు. చుట్టుప్రక్కల అంతా గాలించారు. అయితే 15 ఏళ్ల క్రితం నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్మెంట్ వైపు నుంచే దుర్గంధం వస్తుండడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఎప్పుడూ తెరిచి పెట్టి ఉండే సంపునకు మూత వేసి ఉండడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. సంపును మూసేసి బండరాయి పెట్టి ఉండడంతో డౌట్ వచ్చి తెరిచే ప్రయత్నం చేశారు. చివరకు.. ఎట్టకేలకు సంపులోకి చూడగా అందులో డెడ్ బాడీ కనిపించింది. భరించలేని దుర్వాసన, డెడ్ బాడీ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గాజుల మండ్యం పోలీసులు గుర్తుతెలియని స్థితిలో ఉన్న డెడ్ బాడీని బయటకు తీశారు. రెండు కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి రెండు పాలిథిన్ కవర్లలో డెడ్ బాడీని చుట్టేసి పడేసినట్లు గుర్తించారు. డెడ్ బాడీ వద్ద టాబ్లెట్స్, ఇన్ హేలర్, గుట్కా ప్యాకెట్ మాత్రమే లభించగా యువకుడి మృతదేహం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేసారు. ఇందులో భాగంగానే డెడ్ బాడీ నుంచి వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేశారు. నీటిలో బాగా తడిచిపోయిన డెడ్ బాడీ నుంచి చర్మం ఊడి రావడంతో క్లూస్ టీమ్ సహాయంతో ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. వేలిముద్రలు మనోజ్ కుమార్ అనే నేరస్తుడి వేలిముద్రలుగా గుర్తించిన పోలీసులు క్రైమ్ రికార్డులను తిరగేశారు. మనోజ్ కుమార్ పై పలు పోలీస్ స్టేషన్ల లో కేసులు ఉన్నట్లు గుర్తించారు.
కరెంట్ మోటర్లు స్టార్టర్లు దొంగతనాలు చేస్తున్న మనోజ్ కుమార్ నేరాలను బయట తీశారు. రేణిగుంటలోని టీబీఐడీ కాలనీకి చెందిన మనోజ్ కుమార్ వృత్తిరీత్యా పెయింటర్ కాకా రాత్రిపూట మరో నలుగురు స్నేహితులతో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మనోజ్ తో కలిసి నేరాలకు పాల్పడిన స్నేహితుల వివరాలను తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించారు. తరచూ చోరీలు చేస్తూ పట్టుబడ్డ మనోజ్ జైలుకు వెళ్లి తిరిగి వచ్చాక దొంగతనాలకు దూరంగా ఉంటూ పెయింటింగ్ పనుల్లోనే ఉండిపోయాడు. అయితే పాత నేరస్తుడు కావడంతో జరుగుతున్న నేరాలను విచారించే పనిలో పోలీసులు తరచూ మనోజ్ ను పట్టుకోవడం విచారించడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను మనోజ్ నుంచి సేకరించిన పోలీసులు కొన్ని కేసులు ఛేదించారు.
పోలీసులకు పట్టు పడడానికి కారణం మనోజ్ కారణమన్న అనుమానంతో స్నేహితులు మనోజ్ ను టార్గెట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మనోజ్ కు గత కొంతకాలంగా స్నేహితులకు మధ్య దూరం కూడా పెరగడంతో మనోజ్ ఫ్రెండ్స్ కు టార్గెట్ అయ్యాడు. ఈ మేరకు పది రోజులపాటు రెక్కీ నిర్వహించి మనోజ్ కదిలికలను పసిగట్టారు. పక్క ప్లాన్ చేసి గత ఆదివారం స్కెచ్ అమలు చేశారు. ఉదయం నుంచి ఇంటి వద్ద ఉన్న మనోజ్ కు మిగతా ముగ్గురు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. ఆర్థిక లావాదేవీల విషయంలో మనోజ్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామంటూ రేణిగుంటలోని ఒక నిర్మానుష ప్రాంతానికి రమ్మని ఫోన్ కట్ చేశారు. దీంతో లొకేషన్ కు చేరుకున్న మనోజ్ ను హతమార్చి సంపులో పడేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఈ మేరకు నిందితులు ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
హత్యకు గురైన మనోజ్ మొబైల్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు ఈ కేసులో మరింతమంది నిందితులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిన్న ఉదయం బయటపడ్డ డెడ్ బాడీ ఆచూకీ గుర్తించి ఇలా పోలీసులు 24 గంటల్లోనే నిందితులు ఎవరన్నా దానిని కనిపెట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
Also Read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





