ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని నోట్లు దేవుడికి ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా.. తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్ధానం హుండీలో వెలుగుచూడటం చర్చ నీయాంశంగా మారింది. దేవుడా నేను బాధల్లో ఉన్నాను.. వీటిని తీర్చు.. కష్టాలు తీరి కోలుకుంటే ఫలానాది నీకు సమర్పించుకుంటాను అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, కోరికలు తీరిన తర్వాత కొందరు అనుకున్న విధంగా డబ్బు, తలనీలాలు సమర్పించడం, బంగారం, వెండి , తులా భారం ఇలా పలు విధాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, తాజాగా హుండీలో బొమ్మ నోట్లు చూసి అధికారులే షాకయ్యారు..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల దేవస్ధానం అధికారులు హుండీ లెక్కించారు. దేవస్థానానికి రికార్డు స్ధాయిలో ఆదాయం లభించింది. 41 రోజులకు గాను రూ.4.22 కోట్లకు పైగా నగదు, 569 గ్రాముల బంగారం, 7708 కిలోల వెండి లభించాయి. వీటితో పాటు చెల్లని పాత నోట్లు 30 వరకు రూ.500 , 20 నోట్లు వెయ్యి రూపాయలవి, మూడు 2వేల నోట్లతో పాటు విదేశీ కరెన్సీ ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి బొమ్మనోట్లు 500 కట్టగా వేశారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయి వాటిని పనికి రానివిగా పరిగణించి పక్కన పెట్టారు.
పిల్లలు అనుకోకుండా ఎవరైనా హుండీలో వేశారా..? లేదా? కావాలనే ఇలాంటి పని చేశారో తెలియదు కాని దేవస్ధానం అధికారులతోపాటు.. సిబ్బంది ఆశ్చర్యపోయారు.
Also read
- పరగడుపున తులసి టీ.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దివ్యౌషధం ఇదే!
- ఆత్మ నరకలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
- భార్యను తిట్టిన భర్త.. తననే దూషించాడని భావించి పక్కింటి మహిళ దాడి! ఆ తర్వాత సీన్ ఇదే..
- నీది ఫేక్ బంగారం అంటే నీది ఫేక్.. గోల్డ్ మాన్ ల మధ్య లొల్లి.. ఇంటిపై దాడి..





