Siddipet man suicide after falling under RTC Bus: సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు టైర్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట పొన్నాల దాబాల వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోడ్డుపై..
సిద్దిపేట, అక్టోబర్ 31: సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు టైర్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట పొన్నాల దాబాల వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోడ్డుపై ఓ వ్యక్తి నడుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. అయితే అతడు నడి రోడ్డులో నడుస్తుండటంతో వాహనాలు అతడిని తప్పించుకుని వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో సదరు వ్యక్తి వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు హారన్ కొట్టడంతో వెనక్కి తిరిగి చూసిన ఆ వ్యక్తి.. ఉన్నట్లు బస్సు దగ్గరికి వెళ్లి దాని టైర్ల కింద పడిపోయాడు.
గమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో టైర్లు అతడిపైకి ఎక్కాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజుగా గుర్తించారు. బస్సు వస్తుండగా అతడు చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం వీడియోలో కనిపించింది. సీసీఫుటేజ్ లో రికార్డ్ అయిన ఆత్మహత్య దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. మృతుడి ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా





