Sun Shukra Yuti Benefits: నవంబర్ 3 నుండి 16 వరకు తులా రాశిలో రవి, శుక్రుల కలయిక 5 రాశులకు అద్భుత ధన, రాజయోగాలను తెస్తుంది. ఈ గ్రహాల యుతి మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక వృద్ధి, ఆస్తి లాభాలు, కుటుంబ సంతోషాలను ప్రసాదిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇది సంపదను, సుఖమయ జీవితాన్ని అందిస్తుంది.
Dhana Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, శుక్రులు రెండూ రాజయోగ గ్రహాలు. ఈ గ్రహాల యుతి వల్ల రాజ యోగాలతో పాటు ధనయోగాలు కూడా కలుగుతాయని, కుటుంబ జీవితం, దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. నవంబర్ 3 నుంచి 16 వరకు ఈ రెండు గ్రహాలు తులా రాశిలో కలవడం జరుగుతోంది. తులా రాశి శుక్రుడికి సొంత రాశి కాగా, రవికి ఈ రాశి నీచ రాశి. అందువల్ల కొన్ని రాశులకు రాజయోగాల కంటే ధన యోగాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ రవి, శుక్రుల కలయిక వల్ల అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది.
మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి, శుక్రులు కలవడం వల్ల ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరగడం కూడా జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు తప్ప కుండా ఫలిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, రవుల యుతి వల్ల ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి విజయం సిద్ధిస్తుంది. స్థిరాస్తిక్రయ విక్రయాల వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. విలాస జీవితం అలవడుతుంది.
తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో లాభాధిపతి రవి కలవడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు బాగా విస్తరిస్తాయి.
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, రవులు కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ప్రముఖులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్నిమించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది
Also read
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
- ఇంకా వీడని నిజామాబాద్ మహిళ మర్డర్ మిస్టరీ.. తల, చేతి వేళ్లు మాయం!
- విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది





