Khammam News: విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తి ఉంటే తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు పేరెంట్స్. ఎంతైనా కట్న కానుకలు ఇచ్చేందుకు సిద్ధపడతారు. జీవితంలో అమ్మాయి హాయిగా సెటిలవుతుందని భావిస్తుంటారు. మ్యారేజ్ కాగానే అసలు విషయం తెలిసి షాకైన ఉదంతాలు లేకపోలేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఖమ్మం జిల్లా భద్రాచలంలో వెలుగు చూసింది.
భార్యకి నరకం చూపిన అమెరికా అల్లుడు
భద్రాచలంకు చెందిన తాళ్లూరి ప్రవీణ్ రాజా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల ద్వారా అతడిని వివాహం సెట్టయ్యింది. పకాలపాటి పూజితతో ప్రవీణ్ కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అల్లుడికి ఇవ్వాల్సిన లాంఛనాలు అత్తారింటివారు ఇచ్చారు. మ్యారేజ్ తర్వాత పూజిత అమెరికా వెళ్లింది.ఇద్దరూ అక్కడే ఉద్యోగం చేసేవారు.మొదట్లో ఆ దంపతులు బాగానే ఉండేవారు.
పెళ్లి తర్వాత పూజితకు మానసిక, శారీరక వేధింపులు మొదలయ్యాయి. పూజిత వెళ్లిన ఆరు నెలల తర్వాత అక్కడికి అత్తమామలు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెకు నరకం మొదలైంది. అటు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక నరకం అనుభవించింది. రోజురోజుకూ భర్త, అత్తమామల నుంచి టార్చర్ పెరగడంతో తట్టుకోలేక పోయింది. తన జీతాన్ని ఆమె అకౌంట్కి కాకుండా భర్త, అత్తమామల ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపించింది.
పెళ్లయిన వారం నుంచే
కనీసం ఖర్చులకు డబ్బులు లేకుండా చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని వాపోయింది. ఈ విషయాన్ని పేరెంట్స్ దృష్టికి తెచ్చింది. సమస్యలు సర్దుకుంటాయని కూతురికి నచ్చజెప్పారు. చివరకు మార్చి 15న భద్రాచలం పోలీసులకు పూజిత ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేష్ ఫోన్లోని వీడియోను స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





