హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యసై దాడికి యత్నం జరిగింది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నింగా.. దొంగలు వారిపైనే తిరగబడ్డారు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య గన్మెన్ దగ్గరున్నతుపాకీతో వారిపై కాల్పులు జరిపారు.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చాదర్ఘట్ పీఎస్ పరిధిలో సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యసై దాడి చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లను అడ్డుకునేందుకు వెళ్లిన డీసీపీ గన్మెన్ కిందపడిపోయారు. వెంటనే అతన్ని నుంచి గన్ తీసుకున్న డీసీపీ నిందితులు తప్పించుకోకుండా వాళ్లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
డీసీపీ కాల్పుల్లో ఆ దొంగలు గాయపడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Also read
- Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ కేసు దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. బళ్లారిలో పట్టుబడిన బంగారం..
- Telangana: ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
- Telangana: ఫోటో చూసి బుద్దిమంతుడు అనుకునేరు.. చేసేవి పోరంబోకు పనులు.. మ్యాటర్ తెలిస్తే
- Andhra: నాగులచవితి రోజున ఏపీలో అద్భుతం.. ఈ దృశ్యాలు చూస్తే పుణ్యం మీ సొంతం..
- Telangana: పగలు పద్దతిగా కస్టమర్ క్యారెక్టర్.. రాత్రి మంకీ క్యాప్ ధరించి.. అతడు ఏం చేశాడంటే.?





