SGSTV NEWS online
CrimeTelangana

మంత్రిగారి ఇలాఖాలో ఇజ్జత్‌కా సవాల్.. అసలెవరీ సుమంత్? ఏమిటి అతగాడి బ్యాక్‌గ్రౌండ్?

 

నార్ల సుమంత్.. సన్నాఫ్ నార్ల సుబ్రమణ్యం.. కేరాఫ్ మంత్రి కొండా సురేఖ. ఇప్పుడు టోటల్ తెలంగాణలో పొలిటికల్‌గా, ప్రభుత్వపరంగా ఇతడి గురించే చర్చ. OSDగా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో టెర్మినేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాస్తా మంత్రిగారి ఇలాఖాలో ఇజ్జత్‌కా సవాలైంది. అసలెవరీ సుమంత్? ఏమిటి అతగాడి బ్యాక్‌గ్రౌండు?


నార్ల సుమంత్.. సన్నాఫ్ నార్ల సుబ్రమణ్యం.. కేరాఫ్ మంత్రి కొండా సురేఖ. ఇప్పుడు టోటల్ తెలంగాణలో పొలిటికల్‌గా, ప్రభుత్వపరంగా ఇతడి గురించే చర్చ. OSDగా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో టెర్మినేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాస్తా మంత్రిగారి ఇలాఖాలో ఇజ్జత్‌కా సవాలైంది. అసలెవరీ సుమంత్? ఏమిటి అతగాడి బ్యాక్‌గ్రౌండు?


నార్ల సుమంత్.. ఇతగాడి జర్నీనే జబర్దస్త్‌గా ఉంటుంది. మొదటి కొలువు పొల్యూషన్ బోర్డులో కాంట్రాక్ట్ ఉద్యోగం. వేలల్లో జీతమే తప్ప పీతం లేదు. అందుకే, వన్ ఫైన్ మార్నింగ్.. డిప్యూటేషన్ మీద మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా అపాయింట్ అయ్యారు. ఏడాదికోసారి డిప్యుటేషన్ పొడిగించుకుంటూ ఆమె దగ్గరే తిష్ట వేసుకున్నాడు. ఈ డిసెంబర్లో సుమంత్ డిప్యూటేషన్ ముగుస్తుంది. పొడిగింపు కోసం మళ్లీ సురేఖ ప్రయత్నిస్తుంటే, ఈలోపే సుమంత్‌ను టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డెక్కన్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను తుపాకీతో బెదిరించారనేది సుమంత్‌పై వచ్చిన బలమైన ఆరోపణ.

నిజానికి, సుమంత్ శుద్దపూస కానేకాదని అతడి ఫ్లాష్‌బ్యాక్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అటవీ శాఖలో బదిలీలు, ప్రమోషన్లకు లంచాలు తీసుకుంటారని, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడడం సుమంత్ నైజమని డిపార్ట్‌మెంట్‌లో టాకుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీషీటర్ గోపాల నవీన్ రాజ్‌తో కలిసి దందాలు చేస్తాడనే ప్రచారం కూడా ఉంది. ఐఏఎస్ అధికారులకు సైతం నేరుగా ఆదేశాలు జారీ చేసే స్థాయికి చేరిన సుమంత్‌కి ఇంకో బ్యాక్‌గ్రౌండుంది. కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్‌కి సుమంత్ క్లాస్ మేట్. ఆవిధంగా కొండా కుటుంబానికి దగ్గరయ్యాడు. సుమంత్ గృహప్రవేశానికి సుస్మిత పటేల్ లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చారంటే కొండా ఫ్యామిలీతో సుమంత్‌కి ఎంతటి సాన్నిహిత్యమూ తెలుసుకోవచ్చు.


సుమంత్ కుటుంబం కూడా కొంచెం తేడానే. సుమంత్ తండ్రి సుబ్రమణ్యం విద్యుత్ శాఖలో అధికారిగా ఉంటూ, అవినీతి ఆరోపణలతో ఊస్టింగ్ అయ్యారు. సుమంత్ సోదరుడు మహంత్‌పై కూడా హంతకుడనే అభియోగాలున్నాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్న మహంత్ భార్య రమ్యకృష్ణ ఇటీవలే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహంతే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుమంత్ భార్య మనీషా కూడా బాధితురాలే. అతడి వివాహేతర సంబంధాలతో విసిగిపోయి హైటెక్ సిటీలోని తన ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. సుమంత్ తండ్రి సుబ్రమణ్యం, కొండా మురళి ఈ విషయం బైటికి రాకుండా ఆమె పేరెంట్స్‌తో మాట్లాడి సర్దేశారు. సో, ఇదొక ఫ్యామిలీ ప్యాక్ క్రైమ్ కహానీ.

ఇన్ని మచ్చలున్నా, బడాయిలో మాత్రం తగ్గేదే లేదంటున్నాడు నార్ల సుమంత్. కొంపల్లిలో అల్ట్రా మోడర్న్ హౌస్, ఆడి కారు.. విలాసాలే విలాసాలు. హన్మకొండ జిల్లా కదిపికొండలో మూడు విల్లాలు.. ఒక్కోటి ఐదు కోట్ల రూపాయల ఖరీదు. ఇవి కాకుండా, లండన్‌లో సుస్మిత ఉండే ఏరియాలో సుమంత్ ఇటీవలే ఓ ఇల్లు కొన్నాడట. అతడి సోదరుడు మహంత్ కూడా ఆస్ట్రేలియా నుంచి లండన్ షిప్ట్ అయ్యారట. సుమంత్ తల్లి సుగుణాదేవి వరంగల్ భద్రకాళీ ఆలయం బోర్డులో సభ్యురాలు. సుమంత్ ఓఎస్డీగా ఉన్నప్పుడు మంత్రి సురేఖతో చెప్పించుకుని మరీ తన తల్లిని ధర్మకర్తగా నియమించుకున్నాడు. సో, కొండా ఫ్యామిలీతో నార్ల సుమంత్ కనెక్షన్ చాలాచాలా బలమైనది. అందుకే, సుమంత్ కోసం కొండా సురేఖ ఎందాకైనా వెళ్తున్నారా?

Also read

Related posts