విజయవాడ: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విజయవాడ వాంబేకాలనీలోని ఏ బ్లాక్ ఘటన చోటు చేసుకుంది. గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న దోమల సంగీతరావు వాంబేకాలనీ జీ ప్లస్ -3 అపార్ట్ మెంట్ ఏ బ్లాక్ లో నివాసం ఉంటున్నాడు. గంజాయి కేసులో విచారణ చేసేందుకు నున్న గ్రామీణ పోలీసులు మధ్యాహ్నం సంగీతరావు ఇంటికి వచ్చారు. పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు భవనంపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నున్న గ్రామీణ పోలీసులే సంగీత రావుని భవనంపై నుంచి తోసేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పునకు అతన్ని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read
- సెప్టెంబర్లో కృష్ణాష్టమి, వినాయక చవితి సహా.. భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు, వ్రతాలు ఇవే
- నారాయణ బలి అంటే ఏమిటి? మరణం తర్వాత ఈ పూజను ఎప్పుడు, ఎలా చేస్తారో తెలుసా?
- September 2026 Horoscope: ఈ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి, ఆర్థిక లాభాలు..మీ రాశికి ఎలా ఉందంటే..?
- విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
- విజయవాడలో మహిళపై సామూహిక అత్యాచారం?





