చీమలు దూరని చిట్టడవేం కాదూ.. కాకులు దూరని కారడవేం కాదూ.. సిటీలోనే ఉన్న ఫేమస్ కాలేజ్ అది. దాన్ని టార్గెట్ చేసిన దొంగల ముఠా.. మిడ్‌నైట్‌లో ముహూర్తం పెట్టి కోటి రూపాయలు కొట్టేసింది. వెళ్తూ వెళ్తూ నిఘా నేత్రాల బాక్స్ కూడా కొట్టుకెళ్లింది. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంతకీ వాళ్లు లొకల్ దొంగలా? ప్రొఫెషనల్ నేరగాళ్లా?
చీమలు దూరని చిట్టడవేం కాదూ.. కాకులు దూరని కారడవేం కాదూ.. సిటీలోనే ఉన్న ఫేమస్ కాలేజ్ అది. దాన్ని టార్గెట్ చేసిన దొంగల ముఠా.. మిడ్‌నైట్‌లో ముహూర్తం పెట్టి కోటి రూపాయలు కొట్టేసింది. వెళ్తూ వెళ్తూ నిఘా నేత్రాల బాక్స్ కూడా కొట్టుకెళ్లింది. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంతకీ వాళ్లు లొకల్ దొంగలా? ప్రొఫెషనల్ నేరగాళ్లా?
హైదరాబాద్ మహానగరం శివారు అబ్దుల్లాపూర్ మెట్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ ఇది. ఈ కాలేజీని టార్గెట్ చేసిన దొంగలు.. పక్కా ప్లాన్డ్గా లోనికెళ్లి లూటికి తెగబడ్డారు. అర్ధరాత్రి దాటాక దొంగలు క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ముందుగా డోర్ గడియ బ్రేక్ చేశారు. ఆ తర్వాత లాకర్లను ధ్వంసం చేశారు. అందులో నోట్లకట్టలన్నింటిని మూటగట్టుకున్నారు. కాలేజీలో అమర్చిన 200 సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. తమ ఆనవాళ్లు దొరక్కుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఉదయం కాలేజీకి వచ్చిన సిబ్బంది సీన్ చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
కాలేజీకి వెళ్లిన పోలీసులు.. ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. దొంగలు ఏయే రూమ్లోకెళ్లారు. ఏమేం ధ్వంసం చేశారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనా..? అంతకుమించా అన్న దానిపై క్లారిటీకి రాలేకపోయారు. నేరుగా సెఫ్టీ లాకర్స్ ఉండే రూమ్‌కి వెళ్లడం. అలాగే డీవీఆర్‌ను తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాగా తెలిసిన వ్యక్తి పనే అయి ఉంటుందన్న కోణంలో ఆరాతీస్తున్నారు.
దోపిడీకి గురైన మొత్తం ఒకే కాలేజీకి చెందిన సొమ్ము కాదని.. మరో రెండు అనుబంధ కాలేజీలకు చెందిన నగదు కూడా లాకర్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది. పోయిన క్యాష్ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాలేజీలో దొంగతనం జరగడం యజమాన్యాన్నే కాదూ.. పిల్లల తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసింది. విద్యార్థులకు భద్రత కల్పించాలని, సెక్యూరిటీ పెంచాలని కోరారు. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని తెలిపారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!