ఒకటి కాదు రెండు కాదు.. మాయమాటలు చెప్పి ఏకంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓ కిలాడీ లేడీ. మా డబ్బులు మాకు ఇవ్వమని బాధితులు డిమాండ్ చేయడంతో.. వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పటాన్చెరులో ఊహించని మోసం వెలుగు చూసింది. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి విద్య అనే మహిళ అనేక మంది మహిళలను మోసం చేసింది. తక్కువ ధరకు బంగారం, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానని వారికి మాయమాటలు చెప్పి దాదాపు రూ. 18 కోట్ల వరకు వసూలు చేసింది. మాజీ ఎమ్మెల్యే నుంచి దాదాపు 2 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని.. కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని వారిని నమ్మించింది.
వారాసిగూడలో ఉన్నప్పుడు ఈ మోసాలకు పాల్పడిన విద్య.. ఆ తరువాత తన మకాంను పటాన్ చెరుకు మార్చింది. బాధితులు బంగారం, డబ్బు గురించి అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ సమాధానం చెబుతూ వచ్చింది. ఏడాదిన్నరగా పటాన్చెరులో ఉంటోంది. డబ్బులు కోసం బాధితులు ఒత్తిడి చేయడంతో గురువారం వారిని పటాన్చెరులోని తన నివాసానికి పిలిపించి విద్య భర్త అనుచరులతో దాడి చేయించింది. విద్య, ఆమె భర్త అనుచరుల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలంటూ పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?
- Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
- నేటి జాతకములు…15 మార్చి, 2026
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!





