1972 నంబర్ కి ఒక తండ్రి ఫోన్ చేశాడు.. తన కొడుకు గంజాయికి అలవాటు పడిన విషయాన్ని వివరంగా చెప్పాడు. ఎలాగైనా తన కొడుక్కి ఆ అలవాటు మాన్పించాలని తండ్రి పోలీసులకు పదేపదే విన్నవించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతనిపై నిఘా ఉంచారు.

1972 నంబర్ కి ఒక తండ్రి ఫోన్ చేశాడు.. తన కొడుకు గంజాయికి అలవాటు పడిన విషయాన్ని వివరంగా చెప్పాడు. ఎలాగైనా తన కొడుక్కి ఆ అలవాటు మాన్పించాలని తండ్రి పోలీసులకు పదేపదే విన్నవించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతనిపై నిఘా ఉంచారు. మంగళగిరి మండలం బేతపూడికి చెందిన చందు, పెదవడ్లపూడికి చెందిన ఆనంద్ అలియాస్ బొజ్జా అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి కేజీ గంజాయి ఐదు వేల కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తారు. ఒక్కో ప్యాకెట్ ను 500 రూపాయలకు విక్రయిస్తుంటారు. ఈ గంజాయి ప్యాకెట్లతో పాటు సిగరెట్లు విక్రయించడానికి సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్ధులను ఆకర్షిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని వారికి వల విసురుతున్నారు.
మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం సమీపంలో ఉంటూ అక్కడకు వచ్చే యువకులను, విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి సిగరెట్లు విక్రయిస్తుంటారు. ఇలా మొత్తం గుట్టును పెద్దాయన నుంచి సేకరించిన పోలీసులు.. చందు, బొజ్జాలకు తోడు మంగళగిరి బాపిస్టు పేటకు చెందిన బుల్లా రవి, ఆత్మకూరుకు చెందిన తేజ, చైతన్య, లక్ష్మణరావు అనే నిందితులను అరెస్ట్ చేశారు. వీరితో పాటు గంజాయి విక్రయిస్తున్న సాత్విక్, నగేష్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఈ నిందితులను పట్టుకోవటానికి వీరిలో ఒకరి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడమే అని మంగళగిరి పోలీసులు చెప్పారు. తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే వారిపై నిఘా ఉంచి పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో చిక్కుకోక ముందే తల్లిదండ్రులు అలెర్ట్ అవ్వాలని సలహా ఇస్తున్నారు. సమాజంలో విద్యార్ధులు మంచి పౌరులుగా తయారు కావాలంటే తల్లిదండ్రులు వారిపై కచ్చితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు
Also read
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?