హైదరాబాద్ మాదన్నపేటలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. బాలిక హత్య కేసులో ఆమె మేనమామే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. మృతురాలి మేనమామతో పాటు అతని భార్యను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.
హైదరాబాద్ మాదన్నపేటలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. ఉమేని సుమయ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె మేనమామేనని గుర్తించారు. అనారోగ్యంతో తమ కుమార్తె మృతి చెందడానికి సమయ తల్లిదండ్రులు చేతబడి చేయించడమే కారణమని.. కక్ష పెంచుకున్న బాలిక మేనమామ సమీ అలీ, అతని భార్య యాస్మిన్ బేగం సమయను అతి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఈ కేసులో బాలిక మేనమామ అలీతో పాటు అతని భార్యను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. షబానా బేగం, అజ్ముద్దీన్ ఫారూక్ దంపుతులు సంతోష్‌నగర్‌లో నివాసముంటున్నారు. షాబానా బేగం సోదరుడు సమీ అలీ, తన భార్య, తల్లితో కలిసి మాదన్నపేట్‌లోని చావ్‌నీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తరచు బాలిక సుమయ మేనమామ అలీ ఇంటికి వెళ్లేది. అప్పటికే ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే ఇటీవలే అలీ చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. అయితే తన కుమార్తె మృతి చెందడానికి తన సోదరి షబానా కారణమని అలీ భావించాడు.
దీంతో సుమయ ఉత్సహంగా ఉండడం జీర్ణించుకోలేకపోయిన అలీ దంపతులు.. బాలికను అంతమొందించి వాళ్ల తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిల్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక హత్యకు ప్లాన్ చేశారు. అయితే గత నెల 28 సుమయ.. మేనమాన అలీ ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన అలీ దంపతులు బాలికను డాబా మీదకు తీసుకెళ్లి చేతులు తాళ్లతో కట్టేసి. మూతికి ప్లాస్టర్ అతికించి నీటి ట్యాంకు పడేశారు. తర్వాత ట్యాంకు మీద మూత మూసి దానిపై బండరాయి పెట్టారు. దీంతో ఊపిరాడక బాలిక మృతి చెందింది.
అయితే ఆడుకుంటానని మేనమామ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ మీద అనుమానం రాకుండా అలీ దంపతులు కూడా బాలికకోసం వెతినట్టు నాటకం ఆడారు. అయితే సీసీ కెమారాలు పరిశీలించిన పోలీసులు బాలిక ఇంటి నుంచి బయటకు రాలేదని గమనించారు. అనుమానంతో మేనమామ అలీ దంపతులను విచారించగా తామే సుమయను హత్య చేశామని బయటపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామ సమీ అలీ అతని భార్య యాసిన్ బేగంను అరెస్టు చేశారు
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





