SGSTV NEWS
CrimeTrending

Telangana: పండగపూట విషాదం.. బాలుడిని కాపాడేందుకు వాగులో దూకిన ఇద్దరు యువకులు.. కట్‌చేస్తే..


ఓ బాలుడు ఆడుకుంటూ వాగు సమీపంలోకి వెళ్లాడు.. ప్రమాదవశాత్తు జారి వాగులో పడిపోయాడు. అది గమనించిన బాబును కాపాడేందుకు నీటిలో దూకిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకునన్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు..ఈ విషాదకర ఘటన నల్గొం జిల్లాలోని చందంపేట మండలం దేవరచర్లలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం దేవరచర్లకి చెందిన సాయి ఉమాకాంత్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ.. సమీపంలో ఉన్న డిండి వాగు దగ్గరకు వెళ్లాడు.ఈ క్రమంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాగులో జారిపడిపోయాడు. అది గమనించిన అటుగా వెళ్తున్నఇద్దరు వ్యక్తులు బాలుడిని కాపాడేందుకు వాగులో దూకి గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు స్థానికంగా నివసిస్తున్న రాజు(25), భరత్‌కుమార్‌(27)గా గుర్తించారు. మరోవైపు బాలుడి ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్న తెలుస్తోంది. మృతులు దసరా పండక కోసం బంధువల ఇంటికి వచ్చి ప్రమాదానికి గురైనట్టు సమాచారం

Also read

Related posts