SGSTV NEWS
CrimeTelangana

Wife Killed Husband: తెలంగాణలో సంచలనం.. తాగొచ్చిన భర్తను కర్రతో కొట్టి హతమార్చిన భార్య


మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ కలహాలు, మద్యం కారణంగా విపరీతంగా హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఇవి ప్రజల్లో మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల నల్గొండ/సూర్యాపేట పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటి తరహాలోనే భర్త వేధింపులు భరించలేక భార్య హతమార్చి(wife-killed-husband)న సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఈ కోవలోనే తాజాగా మేడ్చల్ పట్టణంలో జరిగిన మరో ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే

మేడ్చల్ పట్టణం, ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ (45), సావిత్రి దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్ భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి భార్య సావిత్రిని వేధింపులకు గురిచేశాడు. ఆమె చాలా సార్లు చెప్పి చూసింది. కానీ అతడు ఎప్పటికీ మారలేదు. ఇందులో భాగంగానే బుధవారం మరోసారి అతడు తన భార్యతో గొడవపడ్డాడు.

దీంతో ఆమె భరించలేక అతడిని హతమార్చింది. క్షణకావేశంలో కర్రతో అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, శ్రీనివాస్ మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

హత్య అనంతరం భార్య తన అంగీకరించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో నిందితురాలు సావిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Also read

Related posts