జగిత్యాల జిల్లాలో యువకుడి హత్య తెలంగాణలో సంచలనంగా మారింది.. ప్రేమలో ఉన్న యువతి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పోస్ట్ చేసినందుకు ఓ యువకుడిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన జగిత్యాల సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో చోటుచేసుకుంది..
జగిత్యాల జిల్లాలో యువకుడి హత్య సంచలనంగా మారింది.. ప్రేమలో ఉన్న ఓ యువతి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పోస్ట్ చేసినందుకు యువకుడిని.. ఆయువతి కుటుంబసభ్యులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన జగిత్యాల సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు యువతికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ చేయడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్ పై కర్రలతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్, తమ అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలుకున్న యువతి కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఆ అమ్మాయి మరో సంబంధం.. వెతుకుతున్నందున, ఇకపై ఆ సంబంధాన్ని కొనసాగించకూడదని సతీష్ ను హెచ్చరించారు.. ఈ పరిణామంతో కలత చెందిన సతీష్, ఆమెపై తనకున్న ప్రేమను ప్రకటిస్తూ, ఎవరూ ఆమెను వివాహం చేసుకోవద్దని హెచ్చరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పోస్ట్ ఆ మహిళ కుటుంబ సభ్యులకు కోపం తెప్పించిందని, శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సతీష్ ఇంటి దగ్గరకు వెళ్లి.. అతనిపై కర్రలతో దాడి చేశారు.. దీంతో సతీష్ అక్కడికక్కడే మరణించాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.
జగిత్యాల గ్రామీణ పోలీసు ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, “ముగ్గురు నిందితులు – నథారి వినంజీ, శాంత వినంజీ, జలాలపై హత్య కేసు నమోదు చేశామని.. తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!