గుంటూరు సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సైబర్ క్రైం ఎస్పీ కేవీ శ్రీనివాస్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురానికి చెందిన గడ్డం శివప్రసాద్ మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేస్తున్నాడు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, కుల, మతాలను రెచ్చగొట్టేలా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. దీనిపై గుంటూరుకు చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీసులు శివప్రసాద్ను అరెస్టు చేశారు.
నిందితుడిని సీఐడీ పోలీసులు స్థానిక ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. అతడి రిమాండ్ను తిరస్కరిస్తూ… 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేయాలని ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎం. శోభారాణి ఉత్తర్వులిచ్చారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!